కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం – మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అతిథిగా హాజరు కావడం జరిగింది.

ముఖ్యంగా ఉన్నత విద్యలో దాదాపు ఏడు వేల మంది కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్న విషయం తెలిసిందే వీరికి తెలంగాణ వచ్చిన తర్వాత 12 నెలల వేతనం ఇవ్వడం జరిగింది. బేసిక్ పే ఇవ్వడం జరిగింది. అలాగే క్రమబద్దీకరణ కోసం జీవో నెంబర్ 16 ను విడుదల చేయడం జరిగింది. క్రమబద్ధీకరణ అంశం కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇలా పలు ప్రయోజనాలను కల్పించిన తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రయోజనాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నదని ముఖ్యంగా నెలనెల వేతనం, క్రమబద్ధీకరణకు సంబంధించి కోర్టులో ఉన్న కేసును వీలైనంత త్వరగా వెకేట్ చేయిస్తామని, క్రమబద్ధీకరణ జరిగే వరకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాల ప్రతినిధులు, ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ మధుసూదన్ రెడ్డి, కనకచంద్రం, శేఖర్, వినోద్, జిల్లా నరసింహ, కడారి శ్రీనివాస్, మాలతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us @