క్రమబద్దీకరణ పై చర్యలు చేపట్టిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి న్యాయ పరమైన చిక్కులు తొలగిపోవడంతో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 లో జీవో నెంబర్ 16 ను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం తెలంగాణ ఏర్పాటు దినోత్సవం జూన్ – 02 – 2014 నాటికి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ జీవోను సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో నమోదు కాబడింది., హైకోర్టు క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిపివేస్తూ స్టే విధించింది.

తాజాగా హైకోర్టు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేస్తూ క్రమబద్ధీకరణకు అనుకూలంగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

గతంలోనే దాదాపు క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి శాఖల వారీగా అర్హులైన అభ్యర్థుల గుర్తింపు… సర్టిఫికెట్ల పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తయిన విషయం తెలిసిందే తాజాగా ఈ ప్రక్రియను కొనసాగించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

Follow Us @