కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వము వెంటనే చేపట్టాలి.

వరంగల్ జిల్లా :: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి 2016 సంవత్సరంలో జీవో నెంబర్ 16 ను విడుదల చేయడం జరిగింది, కానీ కొంతమంది వ్యక్తులు దీనిని తప్పుబడుతూ గౌరవ న్యాయస్థానంలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయవద్దని కేసు వేయడం జరిగింది. సుమారు 6సంవత్సరాల నిరీక్షణ తరువాత గౌరవ న్యాయస్థానంలో విచారణలో భాగంగా కేసును ఈనెల 7వ తేదీన కొట్టివేయడం జరిగింది.


ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ 475 ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఆర్. ప్రవీణ్ కుమార్, గొర్ల రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 16 ని వెంటనే అమలు చేస్తూ పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను చేపట్టాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిచేయాలని పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది.

Follow Us @