శ్రమ దోపిడీకి గురైన కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వం ఇకనైనా ఆదుకోవాలి

  • కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలి
  • ఒప్పంద అధ్యాపకుల సంఘం 475 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొలిపాక భాస్కర్ గొక గణేష్,

జనగామ :: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 పై కోర్టు కేసులు కొట్టివేసినందున కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే ప్రభుత్వం చేపట్టాలని తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొలిపాక భాస్కర్, గోక గణేష్ లు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాట ఫలితంగా జీ ఓ 16 పై కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా తీర్పు వెలువరించింది అన్నారు. రెండు దశాబ్దాలుగా శ్రమదోపిడీకి గురైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ఇకనైనా ఆదుకోవాలని కోరారు. కొంత మంది నిరుద్యోగుల పేరిట కుట్రపూరితంగా పిల్ నెం. 122/2017 వేసి కోర్టు సమయాన్ని వృధా చేయడమే కాకుండా తెలంగాణా రాష్ట్రంలో దాదాపు ఎనమిధి సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కాకుండా కుట్రపూరితంగా అడ్డుకోవడం తో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కాకుండానే మనోవేదనతో చనిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు..

తెలంగాణా ఏర్పడక ముందు ముఖ్యమంత్రి కే సీ ఆర్ ఇచ్చిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ని హామీని అమలు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయినందున తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీ పై కేటీఆర్ 2009 లో సిరిసిల్ల పట్టణం లో ఒప్పంద ఉద్యోగుల ధర్నా టెంట్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తక్షణమే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నిలెబెట్టుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ అడ్డంకి లేనందున తక్షణమే రెగ్యూలరైజేషన్ ప్రక్రియ చేపట్టాలని భాస్కర్,గణేష్ లు తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Follow Us @