క్రమబద్ధీకరణకు కచ్చితమైన ప్రతిపాదనలు పంపండి.

  • ఇంటర్మీడియట్ కమీషనరేట్ కు కీలక సూచనలు
  • కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం కీలక ఆదేశాలు

హైదరాబాద్ (జూలై – 27) : ఇంటర్మీడియట్ విద్య , కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ కమీషనరేట్ అందజేసిన ప్రతిపాదనల్లో ప్రభుత్వ విద్యాశాఖ కొన్ని లోపాలను గుర్తించి ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవడానికి ఖచ్చితత్వంతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఈ క్రింది సమాచారంతో మళ్ళీ పంపమని పైల్ వెనకకు పంపడం జరిగింది.

ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలు :

  1. ఒరిజినల్ జాబితాలోని ప్రతిపాదనలపై ప్రతి పేజీని ధృవీకరించి సమర్పించాలి
  2. తేది: 02.06.2014 కంటే ముందు వున్న జనరల్ & ఒకేషనల్ కోర్స్ లకు సంబంధించి పోస్టులు మంజూరైనా అన్ని G.O. లను జతచేసి పంపించాలి.
  3. కాంట్రాక్టు అధ్యాపకులను రోస్టర్ పాయింట్‌ల ప్రకారం ఫిక్స్ చేసి ప్రతిపాదనలు పంపాలి.
  4. G.O.Ms.No.16, Finance(HRM-1) డిపార్ట్‌మెంట్, తేదీ 26.03.2016 ప్రకారం 02.06.2014 నాటికి ఎంత మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ​​కేటగిరీల వారిగా మంజూరైన పోస్ట్‌లలో పనిచేస్తున్నారో తెలియజేయాలి.
  5. G.O.Ms.No.16, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, 26.02.2016 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం అర్హులైన కాంట్రాక్ట్ అధ్యాపకుల చెక్‌లిస్ట్‌లను అందించాల్సిందిగా కోరుతూ ఇప్పటివరకు ఎందరు కొనసాగుతున్నారో తెలపాలి.
  6. జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులలో అధ్యాపకుల పోస్టుల మంజూరి వివరాలు, ఖాళీలు, పనిచేస్తున్న వివరాలు పూర్తిగా ప్రత్యేక టేబుల్ రూపంలో పంపాలి.
  7. కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం కోసం annexure II, III మరియు IV, V లపై కమీషనర్ గారు, ఇంటర్ విద్య కచ్చితమైన తన సిఫార్సులు చేసి పంపించాలి.
  8. తేది: 02.06.2014 నాటికి ముందు మరియు ఇప్పటివరకు జనరల్ మరియు ఒకేషనల్ కోర్సు లలో కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టుల మంజూరి మరియు పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులలో ఏమైనా వ్యత్యాసం (తేడా) వుంటే పంపించాలి
    (Lr. dtd 19.01.2017 మరియు Lr. dtd 04.07.2022.)
  9. కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇతర యూనివర్సిటీలలో రెగ్యులర్ మరియు దూరవిద్య ద్వారా చదివిన అందరివి ప్రత్యేక జాబితాను పంపాలి.
  10. G.O.Ms.No.101, తేది: 29.07.2006 ప్రకారం అర్హతల సడలింపులో పనిచేస్తున్న వారి ప్రత్యేక జాబితాను పంపాలి.
  11. పారామెడికల్ కోర్సులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క ప్రత్యేక జాబితాను పంపాలి.
  12. ప్రభుత్వం ద్వారా పోస్టులు మంజూరు కాకుండా (7) ఒకేషనల్ కోర్సులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రత్యేక జాబితాను పంపాలి.

కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్దీకరణ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని పూర్తి రూపంలో ప్రభుత్వానికి పంపించాలని కోరారు.

Follow Us @