TSRTC BILL 2023 : గవర్నర్ అమోదం

హైదరాబాద్ (ఆగస్టు – 06) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన TSRTC BILL 2023 కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలిపారు.

TSRTC BILL 2023 ద్వారా దాదాపు 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై పలు అనుమానాలు నివృత్తి కోసం వివరణలు కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వివరణలు ఇచ్చిన నేపథ్యంలో తృప్తి చెందిన గవర్నర్ ఆమోదం తెలిపారు.