మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఉప సంఘం చర్చిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.2వేల కోట్లతో విద్యాపథకం తీసుకు రానున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పథకం అమలుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగంలో వినూత్న మార్పులకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. విద్యారంగంలో అధిక నిధులు ఖర్చు చేయబోతున్నామని పేర్కొన్నారు. పాఠశాలల్లో కొత్త భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు.
Follow Us@