ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఘాలకు నూతన కార్యవర్గాల ఎన్నిక

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ విద్య ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా సిద్దిపేటలో శనివారం ఇంటర్‌ విద్య జేఏసీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్య స్వర్ణోత్సవాలు నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం (GJCPA), ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం (GJLA)కు నూతన కార్యవర్గాల్ని ఎన్నుకున్నారు.

ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కేఎస్‌ రామారావు (ఖమ్మం), సహ అధ్యక్షులుగా రవీందర్‌రెడ్డి, మాధవరావు, ప్రధాన కార్యదర్శిగా కె.కృష్ణకుమార్‌ (నారాయణఖేడ్‌), సంయుక్త కార్యదర్శులుగా ఆంజనేయరావు, ధర్మేంద్ర, మహిళా విభాగం కార్యదర్శిగా కె.రజిత ఎన్నికయ్యారు.

జూనియర్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డా.పి.మధుసూదన్‌రెడ్డి (రంగారెడ్డి), సహ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.లక్ష్మణ్‌రావు (ఆదిలాబాద్‌), సంయుక్త కార్యదర్శిగా విజయశేఖర్‌, మహిళా విభాగం కార్యదర్శిగా సుధారాణి ఎన్నికయ్యారు.

Follow Us@