Home > LATEST NEWS > GOOGLE GEMINI – కృత్రిమ మేధ

GOOGLE GEMINI – కృత్రిమ మేధ

BIKKI NEWS (DEC.19) : Google Gemini పేరు మీద కృత్రిమ మేధ (ఏఐ) సహయంతో నడిచే చాట్ బాట్ ను సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్తగా అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ చాట్ బాట్ ను ఆవిష్కరించింది.

ఇది టెక్స్ట్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ తదితర అంశాలపై యూజర్లకు 90 శాతం కచ్చితత్వంతో కూడిన సమాధానాలు అందిస్తుందని గూగుల్ తెలిపింది.

జెమిని 1.0 వెర్షన్ పేరిట మూడు వేరియంట్లు Gemini Ultra, Gemini Pro, Gemini Nanoను అందుబాటులోకి తెచ్చామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

శాస్త్రీయ పరిశోధన పత్రాల్లో గ్రాఫ్ లు, గణాంకాలను రూపొందించే గూగుల్ జెమిని.. విద్యార్థుల రోజువారీ హోంవర్క్ లోనూ సహాయ పడుతుందని వెల్లడించారు.