ఈ ఏడాది “గోల్డెన్ బాల్” విజేత ఎవరు.?

ఫుట్ బాల్ క్రీడాలో ప్రతి ఏటా అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే ‘బలాన్ డోర్’ (గోల్డెన్ బాల్) అవార్డును అర్జెంటీనా స్టార్ లయెనెల్ మెస్సీ ఏడోసారి సొంతం చేసుకున్నాడు.

34 ఏళ్ల మెస్సీకి అందరికంటే ఎక్కువగా 613 పాయింట్లు లభించాయి. గతంలో 2009, 2010, 2011, 2012, 2015, 2019లలో మెస్సీని ఈ అవార్డు వరించింది.

స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ ‘ల లీగా ‘2020-21 సీజన్లో బార్సిలోనా తరఫున మెస్సీ 30 గోల్స్ టాపర్‌గా నిలిచాడు. మెస్సీ కెప్టెన్సీలోనే ఈ ఏడాది కోపా అమెరికా కప్ ను అర్జెంటీనా గెలిచింది.

Follow Us @