BIKKI NEWS (APR. 10) : GOLD LOAN PROCESS GUIDELINES SOON BY RBI. గోల్డ్ లోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ త్వరలో నూతన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమీక్ష సమావేశం అనంతరం ఒక ప్రకటన చేశారు.
GOLD LOAN PROCESS GUIDELINES SOON BY RBI
బంగారు ఆభరణాలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి నియంత్రిత సంస్థలు బంగారు రుణాలు ఇస్తున్నాయని, అయితే, ఆయా సంస్థల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై నూతన మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు గోల్డ్ లోన్ కంపెనీల రుణ ప్రక్రియను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని అంచనా.
ఈ నేపథ్యంలోనే… ఆర్బీఐ గవర్నర్ ప్రకటన వెలువడిన వెంటనే గోల్డ్ లోన్స్ ఇచ్చే పలు కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్ లో కొంతమేర పడిపోయాయి.
ముత్తూట్ ఫైనాన్స్ షేరు ధర 6.78 శాతం క్షీణించి రూ.2,137.20 వద్ద ముగిసింది.
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 2.50 శాతం క్షీణించి రూ.325.20 వద్ద ముగిసింది.
మణప్పురం ఫైనాన్స్ షేరు 1.86 శాతం క్షీణించి రూ.224.81 వద్ద ముగిసింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్