కాంట్రాక్ట్ ఉద్యోగుల, లెక్చరర్ల జీవో 16 క్రమబద్దీకరణ అమలు సాధన సమితి ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్దీకరణ కోసం 2016లో తీసుకువచ్చిన జీవో 16 పై న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో… తక్షణమే కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధన కోసం జీవో నెంబర్ 16 అమలు సాధన సమితి డాక్టర్ కొప్పిశెట్టి కన్వీనర్ ఏర్పడడం జరిగింది.

★ కార్యవర్గం ::

నూతనంగా ఏర్పాటు చేసిన జి.వొ 16 అమలు సాధన సమితికి కన్వీనర్లు గా డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ కో కన్వీనర్లుగా జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం తరఫున డాక్టర్ వస్కుల శ్రీనివాస్, శోభన్ బాబు, సయ్యద్ జబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం తరఫున రమణారెడ్డి, ఉదయశ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం తరఫున జి.ఉదయభాస్కర్, నవీన్ మైనారిటి జూనియర్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం తరఫున రహీం, ఎస్సీ, ఎస్టీ సంఘం నుండి నగేష్, హెల్త్ డిపార్ట్ మెంట్ నుండి పురేందర్, మోహన్ రెడ్డి, రాజిరెడ్డి, సలహాదారులుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, డాక్టర్ అందె సత్యం, మాచర్ల రామకృష్ణ గౌడ్, సభ్యులను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు,

త్వరలో సాధన సమితిని పూర్తి స్థాయిలో నియమించుకొని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు

Follow Us @