మంత్రి హరీష్ రావు దృష్టికి క్రమబద్ధీకరణ అంశం

హైదరాబాద్ :: జీవో నంబర్ 16 అమలు సాధన సమితి తరపున ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని క్రమబద్ధీకరణ విషయంపై కలవడం జరిగింది.

ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకుల, ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంపై కోర్టు తీర్పును మరియు ఇతర విషయాలును మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి సానుకూలంగా స్పందించి, జీవో నంబర్ 16 అమలు విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగిందని సాదన సమితి కన్వీనర్ డా. కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీవో నంబర్ 16 అమలు సాదన సమితి సలహాదారులు డాక్టర్ అందే సత్యం, మాచర్ల రామకృష్ణ గౌడ్ మరియు TIGLA రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్, పాలిటెక్నిక్ ,మెడికల్, కాంట్రాక్ట్ సంఘాల నాయకులు ,రమణారెడ్డి, మనోహర్, నవీన్ ,మోహన్ రెడ్డి , వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.