GO 16 సాధన సమితిలో చేరిన తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆశ్రమ స్కూల్ కాంటాక్ట్ టీచర్స్ అసోషియేషన్

దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు గా బ్రతుకుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ, జీవో నెంబర్ 16 ద్వారా తమ జీవితాలు లో వెలుగులు వస్తాయని గత ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తరుణంలో హైకోర్టు తీర్పు సానుకూలంగా వచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడంతో జీవో 16 అమలు లక్ష్యంగా ఏర్పడిన సాదన సమితిలో భాగం కావడానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆశ్రమ స్కూల్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాలోత్ సోమేశ్వర్ అంగీకరించారని కన్వీనర్ డా. కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఈ సందర్భంగా కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ అన్ని శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి క్రమబద్దీకరణ అమలు చేయించుకోవాలని పిలుపునిస్తూ … అదేవిధంగా ఇతర కాంట్రాక్టు ఉద్యోగ /అధ్యాపక సంఘాలను జీవో 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితిలో సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.