GNM ADMISSIONS : దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (సెప్టెంబర్ 07) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (GNM COURSES ADMISSIONS 2023) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 16 వరకు పెంచుతూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలిపింది.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తులను డౌన్లోడ్ చేసి వాటిని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో సెప్టెంబర్ 19లోపు, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో అక్టోబర్ 10లోపు సమర్పించాలని వివరించింది.

అక్టోబర్ 4 నాటికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నది.

వెబ్సైట్ : https://dme.telangana.gov.in/