మహారాష్ట్ర, సోలాపుర్ జిల్లా, పరిదేవాడికి చెందిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిసాలేను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020’ వరించింది. దీని కింద రూ.7.38 కోట్ల నగదు బహుమతి ఆయనకు అందుతుంది. ఈ ప్రైజ్ ను టీచింగ్ రంగంలో నోబెల్ ప్రైజ్ గా బావిస్తారు.
ఉపాధ్యాయ వృత్తిలో అత్యంత ప్రభావం చూపి వారికి వర్కే ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును అందిస్తుంది.
ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి.