BIKKI NEWS (JUNE 22) : GLOBAL PEACE INDEX 2024 గ్లోబల్ ప్లీజ్ ఇండెక్స్ 2024 పలు అంశాలపై ప్రపంచాన్ని హెచ్చరించింది. తాజాగా తన నివేదికను విడుదల చేసింది . సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న “ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ” అనే స్వచ్ఛంద సంస్థ సామాజిక భద్రత, స్థానిక అంతర్జాతీయ సంఘర్షణలు ,సైనికీకరణ తదితర 26 అంశాలను ఆసరాగా చేసుకుని 163 దేశాలతో కూడిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 (GPI) నివేదికను రూపొందించింది.
GLOBAL PEACE INDEX 2024
ఇందులో అనేక కఠోర కఠిన వాస్తవాలు బయటపడ్డాయి. అత్యంత శాంతియుత దేశంగా ఐస్ ల్యాండ్ మొదటి స్థానంలో ఉండగా, చివరి స్థానంలో యెమెన్ నిలిచింది.
GPI 2024 TOP 10 COUNTRIES
1) ఐస్‌లాండ్
2) ఐర్లాండ్
3)ఆస్ట్రియా
4) న్యూజిలాండ్
5) సింగపూర్
6) స్విట్జర్లాండ్
7) పోర్చుగల్
8) డెన్మార్క్
9) స్లోవేనియా
10) మలేషియా
టాప్ టెన్ లో అత్యధిక దేశాలు ఐరోపా ఖండం నుంచి ఉండటంతో ఐరోపా ఖండం శాంతియుత ప్రాంతంగా నిలిచింది.
GPI 2024 LAST 10 COUNTRIES
154) మాలి
155) ఇజ్రాయిల్
156) సిరియా
157) రష్యా
158) కాంగో
159) ఉక్రెయిన్
160) అఫ్ఘనిస్తాన్
161) సౌత్ సూడాన్
162) సూడాన్
163) యెమెన్
GLOBAL PEACE INDEX 2024 INDIA RANK
ప్రపంచ శాంతి సూచీలో భారత్ 163 దేశాలకు గాను 116వ స్థానంలో ఉంది.
భారత సరిహద్దు దేశాల ర్యాంకులు
21) భూటాన్
80) నేపాల్
88) చైనా
93) బంగ్లాదేశ్
100) శ్రీలంక
116) ఇండియా
145) మయన్మార్
140) పాకిస్థాన్
148) మయన్మార్
ముఖ్యాంశాలు
ప్రపంచంలోని 97 దేశాలు ఏదో ఒక రకమైన సంఘర్షణలతో ఉన్నాయి. ఈ సందర్శాల కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు
2018 నుంచి డ్రోన్ల వినియోగం 1400% పెరిగింది.
రెండేళ్ల నుండి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకు 2000 మంది చొప్పున మరణిస్తున్నారు. ఉక్రెయిన్ 83 వేల మందిని కోల్పోయింది
2023 అక్టోబర్ నుండి జరుగుతున్న గాజు సంఘర్షణలో 35వేల మందిని ప్రాణాలు కోల్పోయారు
ఈ ఏడాది ప్రపంచ శాంతి సగటు సూచి 0.56% తగ్గిపోయింది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్