BIKKI NEWS : ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP), ఆక్స్‌ఫర్డ్ ‘పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (OPHI) ‘లు కలిసి తాజాగా 110 దేశాలకు సంబంధించిన అంచనాలతో ‘అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచి (MPI) ని విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం పేదరికం గణనీయంగా తగ్గినప్పటికి ఇంకా 1.1 బిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా పేదరికలో మగ్గుతున్నారు.
ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో గడచిన 15 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్య సమితి యొక్క ఈ నివేదిక తెలుపుతుంది.
భారత్, చైనా, కాంగో, ఇండోనేసియా, వియత్నాం తదితర 25 దేశాలు తమ పేదరికాన్ని15 ఏళ్లలో సగానికి తగ్గించుకున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధి (2005-06 నుంచి 2019-21)లో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
2005-06 లో 55.1 శాతంగా ఉన్న పేదరికం.. 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది.
2005-06లో దేశంలో దాదాపు 64.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికంలో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకు.. 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది.
★ మరిన్ని వార్తలు
- HUNGER INDEX 2024 – ప్రపంచ ఆకలి సూచీ నివేదిక
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 10 – 2024
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- NOBEL PEACE PRIZE 2024 -నిహన్ హిడంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
- JL – కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఫలితాలు