న్యూడిల్లీ (సెప్టెంబర్ – 30) : గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్- 2022(GII- 2022) ర్యాంకింగ్స్ భారత్ 40వ స్థానం సాధించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(WIPO) తన వార్షిక నివేదికలో ఈ ర్యాంకింగులను ప్రకటించింది. భారత్ 2021లో 46వ స్థానంలో నిలిచింది.
తొలి ఐదు స్థానాల్లో స్విట్జర్లాండ్, అమెరికా, స్వీడన్, బ్రిటన్, నెదర్లాండ్స్ నిలిచాయి.
2015లో భారత్ 81వ స్థానంలో ఉంది. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి సంవత్సరం ఈ ర్యాంకులను కేటాయిస్తారు.