ఆకలి భారతం – ప్రపంచ ఆకలి సూచికలో దిగజారిన భారత్ ర్యాంక్

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో (ప్రపంచ ఆకలి సూచిక – G.H.I.) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానంలో నిలిచింది. తాజా నివేదిక ప్రకారం 2020లో 94వ స్థానం నుండి 101కి దిగజారింది.

ఈ నివేదిక ప్రకారం పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా భారతదేశం వెనుకబడి ఉండడం గమనార్హం.

బెలారస్,బోస్నియా, బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్‌ఐ నివేదికలో టాప్ ర్యాంక్‌లో నిలిచాయని, చివరి స్థానంలో సోమాలియా నిలిచిందని ఆకలి, పోషకాహార లోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది.

ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది.

Follow Us @