BIKKI NEWS (JAN. 31) : GLOBAL CORRUPITON INDEX 2023 లో 180 దేశాలకు గానూ మొదటి స్థానంలో డెన్మార్క్, చివరి స్థానంలో సోమాలియా నిలిచాయి.
ఈ నివేదిక లో భారత్ 93వ స్థానంలో (india rank in global corruption index 2023) నిలిచింది. గత ఏడాది 85వ ర్యాంకులో నిలిచిన భారతదేశంలో అవినీతి మరింత పెరగడంతో ఈ సారి 8 స్థానాలు కిందకు దిగజారింది.
ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 2023 ఏడాదికి సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది.
ప్రభుత్వ రంగంలోని అవినీతిపై నిపుణులు, వ్యాపార వేత్తలు తదితరుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా 0 నుంచి 100 స్కేల్ ద్వారా ఈ సూచీని తయారు చేశారు. ఇందులో సున్నాను అత్యంత అవినీతిగా, 100ను స్వచ్ఛమైనదిగా లెక్కకడుతూ స్కోర్ ఇచ్చారు. 2023లో భారత్ స్కోర్ 39 కాగా, 2022లో ఈ స్కోర్ 40గా ఉన్నది.
★ అతి తక్కువ అవినీతి గల దేశాలు
1) డెన్మార్క్
2) ఫిన్‌లాండ్
3) న్యూజిలాండ్
4) నార్వే
5) సింగపూర్
6) స్వీడన్
6) స్విట్జర్లాండ్
8) నెదర్లాండ్స్
9) జర్మనీ
9) లక్సెంబర్గ్
★ అత్యంత అవినీతి గల దేశాలు
180) సోమాలియా
177) వెనిజులా
177) సిరియా
177) దక్షిణ సూడాన్
176) యొమెన్
172) ఉత్తర కొరియా
172) నికరగ్వా
172) హైథీ
172) ఈక్వటోరియల్ గినియా
170) తుర్ఠుమెనిస్తాన్
170) లిబియా
★ భారత పొరుగు దేశాల అవినీతి
26) భూటాన్
76) చైనా
93) ఇండియా
108) నేపాల్
115) శ్రీలంక
133) పాకిస్థాన్
149) బంగ్లాదేశ్
162) అప్ఘనిస్తాన్
162) మయన్మార్
వెబ్సైట్ : https://www.transparency.org/en/cpi/2023/