BIKKI NEWS : GK BITS IN TELUGU 4th NOVEMBER
GK BITS IN TELUGU 4th NOVEMBER
1) ప్రాథమిక హక్కుల భాగాన్ని భారత రాజ్యాంగం అంతరాత్మ లేదా వివేకం అని వర్ణించినది ఎవరు?
జ : జవహర్ లాల్ నెహ్రూ
2) భారతదేశ విదేశీ విషయాలలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఏ శక్తికి లొంగదు అనే అంశాన్ని తెలిపే రాజ్యంగలోని పదం?
జ : సర్వసత్తాక
3) భారత రాజ్యాంగంలోని 112 వ అధికరణ దేని గురించి తెలుపుతుంది.?
జ : వార్షిక ఆర్థిక నివేదికను తయారు చేయడం
4) 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది.?
జ 6 నుండి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించిన ప్రకరణ 21(A) చేర్చడం
5) రాజ్యాంగ ప్రకరణ 352 కింద అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఏ ప్రకరణలో ఇమిడి ఉన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి లేదు.?
జ : 20 21
6) ఏ చట్టం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది.?
జ : రెగ్యులేటింగ్ చట్టం 1773
7) జికా వైరస్ వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి?
జ : మైక్రోసెఫాలి
8) జాతీయ వైమానిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 8
9) పరంపరాగత కృషి వికాస యోజన పథకం దేనికి సంబంధించినది.?
జ : సేంద్రియ ఎరువుల ప్రోత్సాహం
10) భారతీయ శాస్త్రాల ప్రకారం కింది వాటిలో ఏ నదికి పుష్కర ఉత్సవాలు నిర్వహించరు.?
జ : మహానది
11) భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు.?
జ : 1972
12) భారతదేశంలో జలకాలుష్య నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు.?
జ : 1974