BIKKI NEWS : GK BITS IN TELUGU 3rd DECEMBER
GK BITS IN TELUGU 3rd DECEMBER
1) ఏ ఆర్టికల్ పేదలకు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని నిర్దేశించింది.?
జ : ఆర్టికల్ 39 (A)
2) జాతీయ గీతం జనగణమనను బహిరంగంగా ఆలపించాలని ఒత్తిడి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని, మౌనంగా ఉండటం కూడా భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది.?
జ : బిజోయ్ ఇమ్మాన్యూయోల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ
3) రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే ఆర్టికల్ 356 ను చివరి అస్థ్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని ఏ కమిషన్ సిఫారసు చేసింది.?
జ : రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్
4) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని ఏ ఆర్టికల్ వివరిస్తుంది.?
జ : ఆర్టికల్ 61
5) రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని మన రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది.?
జ : అమెరికా
6) నెహ్రు 1954లో పంచశీల ఒప్పందాన్ని ఏ చైనా నాయకుడుతో కుదుర్చుకున్నారు.?
జ : చౌ ఎన్ లై
7) భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ఎప్పటినుండి అమల్లోకి వచ్చింది.?
జ : 1990 జనవరి 30
8) వాహన కాలుష్యం వలన ఆర్టికల్ 21 లో పేర్కొన్న జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుందని ఏ నగరంలో డీజిల్ బస్సులను సిఎన్జీ బస్సులుగా మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.?
జ : న్యూఢిల్లీ
9) కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉంటుంది.?
జ : రాష్ట్ర ప్రభుత్వం
10) సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్దేశిస్తారు.?
జ : పార్లమెంట్
11) రాజ్యసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో ఎన్నో వంతు మంది ప్రతి రెండేళ్లకోసారి పదవి విరమణ పొందగా వారి స్థానంలో కొత్త వారు ఎన్నికవుతారు.?
జ : 1/3 వ వంతు
12) లోక్ సభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను రాజ్యసభకు పంపిన తర్వాత ఎన్ని రోజుల్లోగా ఆమోదం తప్పనిసరిగా తెలియజేయాలి.?
జ : 14 రోజులు
- డిసెంబర్ నెలలో ముఖ్య విద్య ఉద్యోగ సమాచారం
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 12 – 2024
- NAVY DAY – నౌకాదళ దినోత్సవం
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 04
- GK BITS IN TELUGU 4th DECEMBER