BIKKI NEWS : GK BITS IN TELUGU 20th SEPTEMBER
GK BITS IN TELUGU 20th SEPTEMBER
1) టీవీ రిమోట్ కంట్రోల్ లో వాడే కిరణాలు ఏవి.?
జ : పరారుణ కిరణాలు
2) ఆకాశం నీలి రంగులో ఉండడానికి కారణం ఏమిటి.?
జ : కాంతి పరిక్షేపనం
3) విచలనం తక్కువగా ఉండే రంగు ఏది.?
జ : ఎరుపు
4) అత్యధిక శక్తితో ద్రవ్యంలోకి చేర్చుకొని పోయే కిరణాలు ఏవి.?
జ : ఎక్స్ కిరణాలు
5) ఏ కిరణాలను ఫోటోలు తీయడానికి మరియు చీకట్లోని వస్తువులను గుర్తించడానికి వాడుతారు.?
జ : ఇన్‌ప్రారెడ్ కిరణాలు
6) మైక్రో తరంగాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : హెర్జ్
7) రాడార్ ను కనుగోన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : వాట్సాన్
8) కిరణజన్య సంయోగ క్రియకు దోహదపడే రంగు ఏది.?
జ : నీలి రంగు
9) కిరణజన్య సంయోగ క్రియకు అధికంగా ఉపయోగపడే రంగు ఏది.?
జ : ఎరుపు
10) రాక్ సాల్ట్ తో తయారైన పట్టకాలు ఏ వికిరణాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.?
జ : పరారుణ కిరణాలు
11) అతినీలలోహిత కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : రిట్టర్
12) కుళ్ళిన, మంచి గుడ్లు వేరు చేయడానికి ఉపయోగించే కిరణాలు ఏవి.?
జ : అతినీలలోహిత కిరణాలు
13) ఒరిజినల్, నకిలీ డాక్యుమెంట్లు గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి.?
జ : అతినీలలోహిత కిరణాలు
14) గామా కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : వోల్లార్డ్
15) ఎముకల ద్వారా కూడా ప్రయాణించే కిరణాలు ఏవి.?
జ : గామా కిరణాలు