GK BITS IN TELUGU 13th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 13th SEPTEMBER

GK BITS IN TELUGU 13th SEPTEMBER

1) సంస్కృతం ఏ భాషా కుటుంబానికి చెందినది.?
జ : ఇండో ఆర్యన్

2) భూ స్థిర కక్ష ఉపగ్రహానికి ఒక భ్రమణానికి పట్టే కాలం ఎంత.?
జ : 24 గంటలు

3) సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు.?
జ : కోపర్నికస్

4) కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు ఎందుకు.?
జ : స్థిరత్వం పెంచుకోవడానికి

5) గురుత్వాకర్షణ శక్తి సూత్రం కనుగొన్నది ఎవరు.?
జ : న్యూటన్

6) కెప్లర్ నియమం ప్రకారం సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ ఏ మార్గంలో పరిభ్రమిస్తున్నాయి.?
జ : దీర్ఘ వృత్తాకార మార్గంలో

7) భూ ఉపరితలం నుండి భూస్థావర ఉపగ్రహం ఉండే ఎత్తు ఎంత.?
జ : 36,000 కీ.మీ.

8) భూ కేంద్రం నుండి భూస్థావర ఉపగ్రహం ఉండే ఎత్తు ఎంత.?
జ : 42,400 కీ.మీ.

9) వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగించే మీటర్ ఏమిటి?
జ : ఓడోమీటర్

10) వస్తువు స్థానభ్రంశంలో కలిగే మార్పు రేటును ఏమంటారు.?
జ : వేగం

11) భూమిపై వేగంగా పరిగెత్తే జంతువు చిరుత పులి దాని వేగం ఎంత.?
జ : గంటకు 97 కి.మీ

12) వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్ని ఏమంటారు.?
జ : భారం

13) కేంద్రక సిద్ధాంతాన్ని రెండవ శతాబ్దంలో ఎవరు ప్రతిపాదించారు.?
జ : టాలేమి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు