BIKKI NEWS : GK BITS IN TELUGU 13th OCTOBER
GK BITS IN TELUGU 13th OCTOBER
1) మూత్రం ఉత్పత్తికి బాధ్యత వహించే ప్రాథమిక అవయవం ఏది.?
జ : మూత్రపిండాలు
2) మూత్రపిండం క్రియాత్మక యూనిట్ ఏది.?
జ : నెఫ్రాన్
3) ఏ పదార్థం ప్రధానంగా మూత్రపిండాల ద్వారా విసర్జితం అవుతుంది.?
జ : యూరియా
4) నెఫ్రాన్ లోని ఏ భాగం రక్తం వడబోతకు భాద్యత వహిస్తుంది.?
జ : భౌమన్ గుళిక
5) మూత్రపిండాలు పాడైన వ్యక్తికి చేయాల్సిన చికిత్స పేరు ఏమిటి.?
జ : డయాలసిస్
6) మూత్రపిండాలకు అనుబంధంగా ఉండే గ్రంధి ఏమిటి.?
జ : ఎడ్రినల్ గ్రంథి
7) సాధారణంగా ఒక రోజులో ఉత్పత్తి అయ్యే మూత్రం పరిమాణం ఎంత.?
జ : 800 – 2,000 మిల్లీ లీటర్లు
8) మూత్రంలో ప్రోటీన్ ఉండటాన్ని ఏమని అంటారు.?
జ : ప్రోటీనురియా
9) మూత్రపిండాలు శరీరంలోని ఏ కుహరంలో ఉంటాయి.?
జ : ఉదర కుహరం
10) ప్రోటీన్ జీవక్రియ వలన ఏర్పడి ప్రధాన వ్యక్తపదార్థం ఏది.?
జ : యూరియా
11) శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించే హార్మోన్ ఏది.?
జ : యాంటీ డియురేటిక్ హార్మోన్
12) అశోకుడు ఏ సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు.?
జ : క్రీ. పూ. 261
13) పుష్యభూతి వంశ స్థాపకుడు ఎవరు.?
జ : ప్రభాకర వర్దనుడు
14) చంద్ర గుప్త మౌర్యుడి ఆస్థానంలో మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఎంత.?
జ : 18
15) అశోకుడు నియమించిన ధర్మమహామాత్రులను గురించి తెలిపే శాసనం ఏది.?
జ : 13వ శాసనం
16) కుషాణులు మధ్య ఆసియాలోని ఏ తెగవారు.?
జ : యూచీ