జీజేఎల్ఏ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిపై చర్యలు

హైదరాబాద్ (జనవరి – 31) : తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (GJLA) అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఆవరణలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ అయిన నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆఫీస్ స్టాఫ్ ముఖ్యంగా మహిళా స్టాప్, ఆఫీస్ రికార్డ్స్ మరియు పరికరాల భద్రత దృష్ట్యా జిజెఎల్ఏ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పై ఇంటర్మీడియట్ కార్యాలయంలోనికి ప్రవేశం నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులలో కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.