తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అభ్యున్నతికి 1969 నుండి కృషి చేస్తున్నా గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (GJLA) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్ విద్య లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగాలు వాటి సంఘాలు వాటి పరిధిలో పనిచేస్తూ ఇంటర్ విద్య అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు.
అలాగే ఒకరి సర్వీస్ మేటర్ ఇంకొకరు వేలు పెడుతూ అనవసర సమస్యలు సృష్టిస్తుంటే GJLA చూస్తూ ఊరుకోదని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. వ్యవస్థలో సరైన గుర్తింపు లేని సంఘాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నాయని… ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తున్న అలాంటి సంఘాల పట్ల బోర్డు పెద్దలు అప్రమత్తంగా మెలగాలని మధుసూదన్ రెడ్డి సూచించారు.
కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం ఇలా వివిధ రూపాలలో ఉన్న టీచింగ్ సిబ్బంది రెన్యూవల్ విషయం నుండి అనేక మేలులు జరగడంలో జి జే ఎల్ ఎ కీలక పాత్ర పోషించిందని… ఇప్పుడు అందులోని కొందరు వ్యక్తులు గుర్తింపులేని సంఘాలతో కలిసి నానాయాగీ చేస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని వారిపట్ల కఠినంగా వ్యవహరించి తీరుతామని మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ఈ సందర్భంగా హెచ్చరించారు.
Follow Us @