ప్రాజెక్ట్ బాల – ఫ్రెండ్స్ ఫర్ హెల్పింగ్ సొసైటీ సహకారంతో సానిటరీ పాడ్స్ పంపిణీ

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయి విద్యార్థినిలకు 40 వేలు విలువగల సానిటరీ పాడ్స్ అందజేత.
  • బాలికల వికాసమే దేశ ప్రగతికి కొలమానం – ప్రముఖ రచయిత, తాడ్వాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్

ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయి బాలికల వికాసమే దేశ ప్రగతికి కొలమానం అని ప్రముఖ రచయిత, తాడ్వాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రాజెక్ట్ బాల – ఫ్రెండ్స్ ఫర్ హెల్పింగ్ సొసైటీ సహకారంతో
జాతీయ సేవా పథకం తాడ్వాయి విభాగం ఆద్వర్యంలో
రుతుస్రావ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది.


ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రుతు స్రావం సహజ శరీర ప్రక్రియ అని, మూఢ నమ్మకాలు, అపోహలు మాని సంతోషంగా గడపాలని కోరారు. పోషకాహారం, పరిశుభ్రత పై శ్రద్ధ వహించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థిని ఆరోగ్య కార్యకర్తగా మారి తమ కుటుంబాలను, సమాజాన్ని శాస్త్రీయ చైతన్యం ను కల్గించాలని కోరారు. “కళాశాలలలో బాలికల నమోదు మరియు ఋతుస్రావ సమయంలో హాజరు పెంచడానికి ప్రాజెక్ట్ బాల సంస్థ ప్రతినిధి నిహారిక ఇచ్చిన పర్యావరణ అనుకూల, తిరిగి ఉపయోగించగల 40 వేలు విలువగల సానిటరీ పాడ్స్ ను విద్యార్థినిలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో లో యన్ ఎస్ ఎస్ అధికారి సంధ్య, అధ్యాపకులు రాములు నాయక్,కిషన్ ,శ్రీలత, మూర్తి, అశోక్, రాజ్ కుమార్, నాగరాజు, బిక్షం మరియు విద్యార్తినిలు పాల్గొన్నారు.