BIKKI NEWS (JAN. 23) : GJC SANGEM MID DAY MEALS PROGRAME. మరియపురం వాస్తవ్యులు నిర్మల బుక్ బైండింగ్ వ్యవస్థాపకులు అల్లం బాలిరెడ్డి జీజేసి సంగెంలో మధ్యాహ్న భోజనానికి విరాళం అందించారు.
GJC SANGEM MID DAY MEALS PROGRAME
ఈ విరాళం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, పేద విద్యార్థుల భవిష్యత్తుపై బాలిరెడ్డికి ఉన్న దాత్రుత్వానికి నిదర్శనం అని కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి బండి విజయ నిర్మల పేర్కొన్నారు.
విద్యార్థులకు అల్లం బాలిరెడ్డి మరియు గోపు మర్రేడ్డి చేతుల మీదుగా భోజనం వడ్డించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్బంగా బాలిరెడ్డి మాట్లాడుతూ సంగెం మండలంలోని వివిధ గ్రామాలలోని నిరుపేద కుటుంబాల నుండి విద్యార్థులు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు కావున ఈ మధ్యాహ్న భోజనం కళాశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగి ఉత్తిర్ణత పెరిగి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో గ్రంధపాలకులు రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ సుధీర్ కుమార్, అధ్యాపకులు బుచ్చిరెడ్డి, అనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, యాకసాయిలు, రాఖీ, మాధవి, కుమారస్వామి, పద్మ, రమాదేవి, సదయ్య, లక్ష్మి, సంగీత మరియు విద్యార్తినివిద్యార్థులు పాల్గొన్నారు.
- NEW POPE – నూతన పోప్ రాబర్ట్ ప్రాన్సిస్ ప్రవోస్ట్
- SSC JOB CALENDAR 2025 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- EAPCET 2025 RESULTS – మే 11న ఎఫ్సెట్ ఫలితాలు
- ఇంటర్మీడియట్ ఫలితాలపై రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం.
- AP GURUKULA RESULT – ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు