BIKKI NEWS (APR. 29) GJC NANGUNUR STUDENTS SELECTED FOR MSN LABS. ఈరోజు సిద్దిపేట జిల్లాలో MSN ఫార్మ కంపెనీ వారు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరుకు చెందిన రజిత, అంజలి మరియు నికిత అనే ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు.
GJC NANGUNUR STUDENTS SELECTED FOR MSN LABS
ఇందుకుగాను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారిని మరియు అధ్యాపక బృందానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ప్రత్యేక చొరవ తీసుకున్న వారి ఫిజిక్స్ అధ్యాపకులు సిహెచ్ దేవయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… గత సంవత్సరం మన కళాశాల నుండి సుమారు 20 మంది ఫార్మా కంపెనీలో సెలెక్ట్ అయ్యారని రాబోవు కాలంలో మన కళాశాలలోనే ఇట్లాంటి ఇంటర్వ్యూలు కల్పించి ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామని తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉచిత హాస్టల్స్ సౌకర్యం, ఫ్రీ డిగ్రీ ఎడ్యుకేషన్ తో పాటు నెలకు 15,000/రూపాయల జీతం, బీమా సౌకర్యం ఉంటుందని వివరిస్తూ దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు.
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE
- GK BITS IN TELUGU 30th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 30
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల యాక్షన్ ప్లాన్