Home > UNCATEGORY > జాతీయస్థాయి SGF పోటీలకు ఎంపికైన జీజేసీ మల్కాజ్గిరి విద్యార్ది

జాతీయస్థాయి SGF పోటీలకు ఎంపికైన జీజేసీ మల్కాజ్గిరి విద్యార్ది

BIKKI NEWS (DEC. 30) : GJC MALKAJGIRI STUDENT SELECTED NATIONAL SGF GAMES. మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కే. నాగరాజు జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఉమాదేవి గారు తెలిపారు.

GJC MALKAJGIRI STUDENT SELECTED NATIONAL SGF GAMES

నాగరాజు ఈనెల 30న జింఖానా గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జావలిన్ త్రో విభాగంలో మంచి ప్రతిభను కనబరిచి మొదటి స్థానం సాధించి బంగారు పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

జాతీయస్థాయి పోటీలు జనవరి 5 నుంచి 8 వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఎస్ జి ఎఫ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో కూడా మంచి ప్రతిభను కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజును ప్రిన్సిపాల్ ఉమాదేవి గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమాదేవి, ఫిజికల్ డైరెక్టర్ జి.జగన్, అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థినివిద్యార్థులు అభినందించడం జరిగింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు