- గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా సాంస్కృతిక వీడ్కోలు సమావేశం
గొల్లపల్లి (మార్చి – 10 ) : విద్యార్థులుతాము ఎంచుకున్న లక్ష్యసాధనకు అహర్నిశలు కృషిచేయాలని గొల్లపెల్లి మండల పరిషత్ అధ్యక్షులు నక్క శంకరయ్య విద్యార్థులకు సూచించారు . తల్లిదండ్రుల ఆశయ సాధనకు ప్రతి విద్యార్థి అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలనిఅన్నారు . శుక్రవారం రోజున గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా సాంస్కృతిక వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు అనేక కష్టాలు పడుతూ తమ విద్యార్థులనుఉన్నత చదువులు చదివించడానికి కృషి చేస్తున్నారని వారి కష్టాన్ని వృధా పోనీయకుండా ప్రతి విద్యార్థి రాణించాలని అన్నారు. కళాశాలప్రిన్సిపాల్ఏనుగుల మల్లయ్య అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలోమండల పరిషత్ ఉపాధ్యక్షులుఆవుల సత్యం ,గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి, భీమ్రాజు పల్లి సర్పంచ్ సత్యనారాయణ ,రంగధామునిపల్లి ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ ,కళాశాల లెక్చరర్లు రేమిడి మల్లారెడ్డి , తిరుపతిరెడ్డి , వెంకటకృష్ణారెడ్డి , తిరుపతి, బాలరాజు ,రాజకుమార్ శ్రీనివాస్ ,నాగలక్ష్మి , రాంప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు .అనంతరం క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందినవిద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు
◆ అలరించిన ఆటపాట
సాంస్కృత క్రీడా సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు
◆ సమావేశ వేదిక నిర్మాణానికి కృషి
కళాశాల మైదానంలో ఇటీవల నిర్మించిన వేదిక పైకప్పు నిర్మాణానికి తగిన ఆర్థిక సహాయం అందిస్తాననిగొల్లపల్లి గ్రామ సర్పంచ్ నిశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు . వీలైనంత త్వరగా సభా వేదిక పైకప్పును నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు వస్తానని ఆయన అన్నారు . సభా వేదిక నిర్మాణానికి హామీ ఇచ్చిన గొల్లపెల్లి గ్రామ సర్పంచి నిశాంత్ రెడ్డికికళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.