ధర్మసాగర్ (మే – 27) : విద్యార్థులు నమోదు పెంచడం కోసం ‘మన మండలం మన కళాశాల’ నినాదంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్ ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ & అధ్యాపకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ… మండలంలోని గ్రామాల సర్పంచ్ లతో విద్యార్థులు, తల్లిదండ్రులకి వద్దకు వెళ్లి మండల కేంద్ర ధర్మసాగర్ కళాశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా సాయిపేట్ , నారాయణగిరి, సోమదేవరపల్లి గ్రామాల సర్పంచ్ లు ప్రచారంలో పాల్గొన్నారు.
సాయిపేట్ సర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్ ప్రిన్సిపాల్ బృందంతో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను పేరెంట్స్ ను కలిసి రెగ్యులర్ అధ్యాపకులను కలిగి నాణ్యమైన గుణాత్మక ఉచిత విద్యను అందిస్తున్న కళాశాలలో చేరాలని కోరుతున్నారు. మండల కేంద్రానికి సమీపంగా ఉన్న బస్ సౌకర్యం లేదని వారి దృష్టికి పేరెంట్స్ తీసుకొచ్చారు. ఈ విద్య సంవత్సరం నుండి బస్ సౌకర్యంను ఏర్పాటు చేస్తానని ఈ లోగా తాత్కాలికంగా వాహన సౌకర్యం ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదగురు విద్యార్థులను తానే నేరుగా ఆన్లైన్ విధానములో నమోదు చేశారు
ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజం పోషించుకుంటున్న కళాశాల పరిరక్షణ వికాసం కోసం నిబద్ధతతో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధుల చేరిక ప్రభుత్వ ఇంటర్ విద్య రక్షణలో వారి భాద్యతను పెంచుతుందని, ప్రజలలో భరోసా ఏర్పడుతుందని అన్నారు .
దీనితో వారి ఆకాంక్షల మేరకు తపనతో పని చేసే ధోరణి మరింతగా అధ్యాపకులలో పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాబురావు, రాములు, వెంకట్, సదానందం, గోపాల కృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.