BIKKI NEWS (APRIL 26) : ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్ లతో పాటు అనేక మంది ఉత్తమ శ్రేణి మార్కులు (GJC DHARMA SAGAR INTER RESULTS) పొందారు.
ఎంపిసి ప్రథమ సంవత్సరంలో గొల్ల రిషిక 466, బండారు మనోజ్ఞ 461, బిపిసి విభాగంలో పుల్లా సాత్విక 437, ఆరూరి సౌమ్య 423, రాష్ట్ర స్థాయి మార్కులు పొందారు. హెచ్ ఈ సి విభాగంలో కొట్టె చందు 432 మార్కులు పొందారు అలాగే కళాశాల ఉత్తీర్ణత 70% నమోదైంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ రాష్ట్ర స్థాయి మార్క్ లను సాధించిన విద్యార్థులను అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించాము. స్టడీ అవర్స్ , అదనపు పని దినాలు నిర్వహణతో ఉత్తీర్ణత శాతం పెరిగింది . తమ పై నమ్మకతో కళాశాలలో తమ పిల్లలను నమోదు చేయించిన తల్లి దండ్రులకు ,ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మసాగర్ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు ఉన్నత విద్యా చదవటానికి కావాల్సిన సహకారం ప్రోత్సాహం ఇవ్వడానికి అనేక సేవా సంస్థలు
ముందుకొచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ పిల్లలను కళాశాలలో చేర్పించాలని ప్రిన్సిపాల్ కోరారు.