- ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల – ధర్మకంచ
BIKKI NEWS (MAY 08) : GJC DHARMA KANCHA ADMISSION DRIVE 2025. జనగామలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (ధర్మకoచ ) ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి మాట్లాడుతూ తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు 2025-2026 అకాడమిక్ కొరకు జనగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి విడత ఉచిత అడ్మిషన్స్ ప్రారంభం అయినట్లు తెలిపారు.
GJC DHARMA KANCHA ADMISSION DRIVE 2025
ఇటీవల పదవ తరగతి పాస్ ఐనా విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు ప్రిన్సిపాల్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్ కొరకు ఉపయోగపడే కోర్సులు (జనరల్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, సి ఇ సి, హెచ్ ఇ సి మరియు బైపీసీ ఉర్దూ మీడియం ).. ఒకేషనల్ విభాగంలోలో ఓ ఏ, ఏ అండ్ టి, ఎం ఎల్ టి, ఏ ఇ టి మరియు ఎం పి ఎచ్ డబ్ల్యూ ) అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
దూర ప్రాంత విద్యార్థుల కొరకు బాల బాలికలకు వేర్వేరుగా ఉచిత కళాశాల అనుబంధ హాస్టల్ వసతి ఉందని, ఉచిత పాఠ్య పుస్తకాలను కళాశాల లైబ్రరీ నుండి అందిస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్ అందించబడునని, మెరిట్ స్కాలర్షిప్,మలబారు స్కాలర్షిప్ అందిస్తూ, డిజిటల్ క్లాసుల ద్వారా బోధన కొనసాగుతుందని తెలిపారు.
సీనియర్ ఆధ్యాపకుల పర్యవేక్షణలో ఎంసెట్ క్లాస్సేస్, ల్యాబ్స్ మరియు స్టడీ అవర్స్ నిర్వహించబడును అని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కల్చరల్ మరియు క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడునని ప్రిన్సిపాల్ తెలుపుతూ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఇటీవల ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రూప్ టాపర్స్ కి అభినందనలు తెలుపుతూ వారి ఫొటోలతో మరియు కళాశాలలో గల సౌకర్యాలను వివరిస్తూ అడ్మిషన్ పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇతర వివరాల కొరకు కళాశాల గల ఆఫీసును సందర్శించాలని తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్