జీజేసీ అల్లాదుర్గం అడ్మిషన్ డ్రైవ్

అల్లాదుర్గం (జూన్ – 03) : ప్రభుత్వ జూనియర్ కళాశాల అల్లాదుర్గం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్యమ్‌రావు ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులు సి. నరసింహ రెడ్డి, శివకుమార్, రమేష్ లు మండలంలోని ఐబి తాండ, జీకే తాండ, మాందాపూర్, చిలువేరు గ్రామాలలో పదవ తరగతిలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అల్లాదుర్గంలో గల ఇంటర్ గ్రూపుల వివరాలను, గత సంవత్సరము సాధించిన ఫలితాల వివరాలను, ప్రభుత్వం అందించుతున్న ఉచిత పుస్తకాల పంపిణీ, స్కాలర్షిప్ ల పంపిణీ, నిపుణులైన అధ్యాపకుల అనుభవాలను గురించి వివరిస్తూ, కళాశాలలో ప్రవేశం పొందవలసిందిగా విద్యార్థులకు సూచించడం జరిగింది. ఇప్పటివరకు 66 ప్రవేశాలను విద్యార్థులు పొందినట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్యామ్ రావు తెలిపారు.