ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులే ద్వితీయ సంవత్సరానికి…

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఫలితాలు అతి త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

  • ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మార్కుల కేటాయింపులో ప్రథమ సంవత్సరం మార్కులనే ప్రామాణికంగా తీసుకుని కేటాయిస్తున్నట్లు తెలిపింది.
  • అలాగే సైన్స్ విద్యార్థులకు గరిష్ట మార్కులను వేయనున్నట్లు తెలిపింది.
  • ప్రథమ సంవత్సరంలో బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులకు కనీస మార్కుల (35 శాతం) తో పాస్ చేస్తున్నట్లు తెలిపింది.
  • అలాగే ప్రైవేటుగా ఫీజు కట్టిన విద్యార్థులకు కూడా 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటించనున్నట్లుగా సమాచారం.
Follow Us @