దంపతులకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలి – సీఎస్ సోమేశ్ కుమార్

ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల ప్రక్రియలో దంపతులకు (స్పౌజ్) ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కేటాయింపు లలో స్పౌజ్ కేసులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, కాలయాపన చేయొద్దని సూచించారు.

ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు, పోస్టింగ్ తరువాత వచ్చిన అప్పీళ్లను కూడా పరిష్కరించాలని, ఒక్కొక్క దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. దూర ప్రాంతాలకు కేటాయించిన వారిని సాధ్యమైనంత మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్ వచ్చే విధంగా చూడాలని సీఎస్ సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల కేటాయింపులు, బదిలీలు, పోస్టింగ్ విషయంలో ఉద్యోగులకు సానుకూలంగా వ్యవహరించాలని సీఎస్కు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.

Follow Us @