జనరల్ కేటగిరీ లో ఉద్యోగానికి అందరూ అర్హులే – సుప్రీం

దేశంలోని ప్రభుత్వ ఉద్యోగాలలో జనరల్‌ కేటగిరీ (ఓపెన్ కేటగిరీ) విభాగంలో ఉద్యోగాల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి రిజర్వేషన్లతో సంబంధంలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రిజర్వేషన్‌ కోటా అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించినప్పుడు వారు జనరల్‌ కేటగిరీ విభాగంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతించాలని స్పష్టం చేసింది. ఓపెన్‌ కేటగిరీ/జనరల్‌ కేటగిరీ అనేది ఒక ప్రత్యేక కోటా కాదని దానికి మహిళలు, పురుషులు, అన్ని రిజర్వేషన్ల కిందకు వచ్చే వారందరూ అర్హులేనని సుప్రీం కోర్ట్ వెల్లడించింది.

Follow Us@