సంపూర్ణ సోలార్ గ్రామంపై జీడీసీ సిద్దిపేట విద్యార్థుల రీసెర్చ్

సిద్దిపేట (ఎప్రిల్‌ – 21 ): ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), సిద్దిపేట బియస్సీ తృతీయ సంవత్సర ఫిజిక్స్ విద్యార్థులు స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి సంకల్పంతో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి సంపూర్ణ సోలార్ విద్యుత్ గ్రామమైన సిద్దిపేట నియోజకవర్గం, నారాయణరావుపేట మండలంలోని బంజరుపల్లి గ్రామాన్ని సందర్శించటం జరిగింది. వారికి గైడ్ టీచర్ గా ఫిజిక్స్ లెక్చరర్ బి.కృష్ణయ్య వ్యవహరించారు.

ఈ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులు పునరుత్పాదక శక్తి వనరుల ప్రాముఖ్యత మరియు గ్రామంలో అమలు చేయబడిన ఇంటింటా సోలార్ విద్యుత్ గురించి వివరాలను సేకరించడం జరిగింది. గ్రామంలో సంపూర్ణ సోలార్ విద్యుత్ వినియోగం గురించి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ శ్రీ శంకర్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీమతి శ్వేత వివరించారు. ఈ రీసెర్చ్ ప్రాజెక్టులో మధుశేఖర్, అక్షయ్ కుమార్, కనకదుర్గ, స్రవంతి, ప్రవీణ్ నాయక్, తుకారాం పరిశోధన విద్యార్థులుగా ఉన్నారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి హెచ్ ప్రసాద్ సార్ మరియు ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ సి హెచ్ మధుసూదన్ గార్లు అభినందించారు.