ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ (475) సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి జబి ఉల్లాతో ప్రత్యేక ఇంటర్వ్యూ

కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల నియామకాలు జరిగిన 2000 వ సంవత్సరం నుంచి వారీ సమస్యలు, హక్కులకై పోరాడుతున్న సంఘంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ (475) సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ప్రచార కార్యదర్శి అయినా జబి ఉల్లాతో ప్రత్యేక ఇంటర్వ్యూ

★ సంఘ ఆవిర్భావం గురించి.?

పోరాటాలతోనే పుట్టింది మా సంఘం, పోరాటాలతోనే సాదించాం, పోరాటాలతోనే సాధిస్తాం. కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రారంభమైన 20 ఏళ్ళ నుండి అన్యాయానికి గురవుతున్న తరుణంలో సమానమైన హక్కుల కోసం పోరాటం చేయడానికి మరియు ప్రభుత్వ కళాశాలలను కాపాడడానికి పుట్టిందే GCLA 475 సంఘం, తెలగుదేశం, కాంగ్రెస్, టీ.ఆర్.ఎస్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. చంద్రబాబు నుండి మొదలుకొని వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కే.సి.ఆర్ గారు ఎవరున్నా కూడా హక్కుల కోసం వారిని పద్దతి ప్రకారం అభ్యర్థించాం, ఫలితం లేనప్పుడు పోరాటాలు చేసాం, కాని ఈ 20 ఏళ్ళ కాలంలో ఏ పార్టికి వ్యతిరేకంగా పని చేయలేదు, మిగితా సంఘాల లాగా తొత్తులుగా కూడా మారలేదు. పోరాటాలతోనే పుట్టింది మా సంఘం, పోరాటాలతోనే సాధించాం, పోరాటాలతోనే సాధిస్తాం. కేవలం మా హక్కుల కోసం, సమాన పనికి సమాన వేతనం, రెగులరైజేషన్ కోసం, ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి, నాణ్యమైన విద్య కోసమే మా పోరాటం, ఆ దిశగానే ప్రయనించాం…. మా విధ్యార్థులను ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాం, తద్వారా ప్రభుత్వ కళాశాలలు కోల్పోయిన గతాన్ని తెచ్చి పెట్టాం. కూలుతున్న ప్రభుత్వ కళాశాలలను పర్వత శిఖరాలవలే నిలబెట్టి తలెత్తుకొనేలా చేసాం, ఇంత చేస్తున్నా కూడా సమాన వేతనం, సమాన హక్కులు లేక పోవడం తో మానసికంగా కుంగిపోతున్న మా లెక్చరర్ల సమస్యలను సాదించడానికి సంఘం ఏర్పాటు చేసి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరియు నేడు తెలంగాణ లోని ఉమ్మడి పది జిల్లాలలో బలమైన శక్తిగా ఎదిగాం, మా 475 సంఘం మహా సముద్రం లాంటిది అన్ని జిల్లా లలో మా నాయకులు సంస్థాగతంగ పటిష్టంగా ఉండి అన్ని రాజకీయ నాయకులతొ సత్సంబంధాలు కలిగి ఉన్నాం, మా సంఘంలో సీనియర్ జూనియర్ అనే తేడాలుండవు, అందరూ కార్యకర్తలే..

★ మీ సంఘం తరపున చేసిన పోరాటాలు సాదించిన ఫలితాలు.?

త్రీమెన్ కమిటీ ద్వారా వ్యవస్థలోకి వచ్చిన సీనియర్ అధ్యాపకులు RJD నియామాకాల ద్వారా వచ్చిన అధ్యాపకులందరు కలిసి ఒకే సంఘంగా ఉంటేనే సమస్యలు సాదించవచ్చని అంతా ఒక్కటై పోరాడుతున్నాం, కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రారంభమైన సమయంలో కేవలం 8..10 నెలలే ఉద్యోగ కాలం ఉండేది, ఎలాంటి సెలవులు లేవు, మహిళాధ్యాపకులకు ప్రసూతి సెలవులు లేవు, ఆ సమయంలో సీనియర్ అధ్యాపకులు చేసిన పోరాటాలు మరువలేనివి CL కోసం నెల రోజులు సమ్మే చేసాం, మా నాయకులు గోవర్ధన్, నాగేశ్వర్ రావ్, గాంధి గార్లు 6 రోజులు ఆమరణ దీక్ష చేసి నెలకో సెలవు సాదించారు, మహిళలకు రెండు నెలల ప్రసూతి సెలవులు, డిస్టిక్ ఆవరేజ్ తొ ఉద్యోగాలు కోల్పోతుంటే వార్షిక పరీక్ష ఫలితాలతో పాటు సప్లమెంటరీ ఫలితాలు పరిశీలనలో తీసుకోవాలని కమీషనర్ ఆర్డర్స్ సాధించాం, 38 రోజులు సమ్మె చేసి కొత్త నోటిఫికేషన్ రాకుండా ఆపగలిగాం, 9 వ PRC కోసం 19 రోజులు సమ్మె చేసి MLC శర్మ గారిని మా బేసిక్ వేతనం కోసం ఆమరణ దీక్షకు కూర్చో పెట్టాం, ఆయనతో పాటు మా సంఘ ఉపాధ్యాక్షులు గంగాధర్ 4 రోజులు పాటు ఆమరణ దీక్ష చేసి 18000 బేసిక్ సాదించారు, తెలంగాణ ఏర్పడ్దాక ముంపు ప్రాంతాల అధ్యాపకులను తెలంగాణ లోకి తెచ్చుకున్నాం, 10 వ PRC కొరకు మిగితా సంఘాలని ఏకం చేసి ముఖ్యమంత్రి నియోజక వర్గం నుండి పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి సమానంగా బేసిక్ వేతనం సాదించాం, మొన్న బదిలీల కొరకు పాదయాత్ర చేసి సాదించాం….ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి, ఇవన్నీ మనందరి ఐకమత్యంతోనే సాదించాం, మిగితా సంఘ నాయకులు ఫలానా సాదించామని చెప్పుకోడానికి ఏది లేదు, వారికి కనీస అవగాహన, బాధ్యత కూడా లేదనిపిస్తుంది.

★ సీనియర్ సంఘంగా వివిధ సంఘాలను కలుపుకుని పోవచ్చు కదా.?

సీనియర్ సంఘంగా అందరినీ కలుపుకుని పోయాం కాబట్టే బేసిక్ వేతనం సాదించాం. మా ఐకమత్యాన్ని దెబ్బ తీయడానికి కొందరు బడా నాయకులు తల్లి లాంటి మా సంఘాన్ని విడతీయాలని కొత్త కొత్త సంఘాలు సృష్టించేలా చేసారు, ఎన్ని సంఘాలు ఏర్పడ్డా కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులందరు మాతృ సంఘం 475 తోనే ఉన్నారు, సొంతంగా ఏ ఒక్క కార్యక్రమం చేసే స్థోమత ఏ సంఘానికి లేదు, సభ్యులను విఛ్చిన్నం చేసే దొరలతో స్వలాభం కోసం చీకటి ఒప్పందాలు చేసే నాయకులను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు, సమస్యలు వస్తే కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి, కాని కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు చిన్న చిన్న సమస్యల కోసం సంఘాలు ఏర్పాటు చేసుకోవడం పరిష్కారం కాదు,
ఉదాహరణకు “లాస్ట్ కం ఫస్ట్ గో” విషయానికస్తే అది కమీషనర్ గారు & అధికారులు తీసుకున్న నిర్ణయమది, అంతకుముందే అది డిగ్రీలో అమలైంది, 2 సం॥రాల సర్వీసు గల వారిని డిస్టర్బ్ చేయకుండా 10 సం॥రాల నుండి కష్టపడ్డ వారిని ఉద్యోగం నుండి తీసివేయడం అన్యాయమని అధికారులు తీసుకున్న నిర్ణయమది, జీ.వో లు ప్రోసిడింగ్ లు సృష్టించె అధికారం ఏ సంఘ నాయకునికి ఉండదు, మా 475 సంఘ అభ్యర్థన మేరకు ఉద్యోగం కోల్పోయిన జూనియర్లను మళ్ళీ ఫీల్డ్ లోకి వచ్చే విధంగా అంచెలంచెలుగా కృషి చేసి ఖాలీ పోస్టులలో తిరిగి తీసుకోవడం జరిగింది, ఏ ఒక్కరు కూడా ఉద్యోగం కోల్పోలేదని గ్రహించాలి. కాని తదనంతరం ఆ సమస్యల సాకుతో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి, కులానికో మతానికో సంఘం ఏర్పాటు చేయడానికి మనది రాజకీయం కాదు.

★ జూనియర్ లు, సీనియర్ లు అనే భేదభావం ఎందుకు వచ్చింది.?

సీనియర్, జూనియర్ అనే భేధ భావం ఎప్పటికీ లేదు, కొందరు లీడర్ షిప్ కోసం విభజించడానికి సంఘాలు సృష్టించారు.
RJD అపాయింటెడ్ BC సంఘం, RJD అపాయింటెడ్ Sc సంఘం, మైనారిటి సంఘమని, అందులో అదనపు విద్యార్హతలు ఉంటే “RJD B.Ed, సంఘమని,” “RJD Ph.d సంఘమని”, బదిలీలు కావాలనుకునే వారు”బదిలీల సంఘమని”, వద్దనుకొనే వారు మరో సంఘమని, ఇలా వంద సంఘాలు సృష్టించుకోవచ్చు. ఐకమత్యాన్ని దెబ్బతీసి విడగొట్టి మనల్ని మనమే నష్టపరుచుకుంటామా.? ఎలా నియామకం అయినా మనమంతా ఒప్పంద అద్యాపకులమనే విషయాన్ని మరిచి కొందరు రాజకీయ నాయకులుగా ఫీల్ అవడం కరెక్ట్ కాదు, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపక కుటుంబం కొరకు పాటు పడడమే నిజమైన నాయకుని లక్షణం, కాని మేమే అర్హులం మాకే రెగులర్ కావాలని 10 మందితో సంఘం పెట్టి ఫోటోలకే పరితమయ్యే వారు ఎన్నటికీ రానించలేరు, అందుకే అలాంటి సంఘాలను జూనియర్లు కూడా నమ్మడం లేదు, RJD ద్వారా అపాంట్ అయిన నా లాంటి వారందరూ 475 సంఘంతోనే ఉన్నారు.

★ బదిలీల పై మీ సంఘ వైఖరి.?


బదిలీల కొరకు గత మూడేండ్ల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, మా ప్రయత్నాల ఫలితంగా బదిలీలు మూడేళ్ళ క్రితమే జరిగేవి, కాని కొందరి అనాలోచిత నిర్ణయాలతో కాంట్రాక్ట్ అధ్యాపకుల శ్రేయస్సును పక్కన పెట్టి కొందరు పెద్ద నాయకుల తప్పుడు సలహాలతో రోడ్డునెక్కి జరిగే బదిలీలలను జరుగకుండా చేసారు.
తర్వాత మా సంఘ నాయకులు అనేక మార్గాల ద్వారా బదిలీల కొరకు అనేక ప్రయత్నాలు చేసారు, చివరికి మా సంఘ దృఢ సంకల్పంతో యాదాద్రి నుండి హైద్రాబాద్ వరకు “బదిలీల సాధన సంకల్ప పాదయాత్ర” చేపట్టాం, ఉద్యమాలు చేసి యాదాద్రి భువనగిరిలో అరెస్ట్ అయ్యి పోలీసుల నిర్భంధంలో ఉన్నాం, మా సంఘం చిత్తశుధ్దితో నిజాయితిగా పనిచేస్తుంది కాబట్టి గౌరవ MLC నర్సిరెడ్డి గారు మా కొరకు భువనగిరి పోలీస్టేషన్ లో భైటాయించారు, మరుసటి రోజు ప్రధాన పత్రికలలో మొదటి పేజీలో వచ్చేలా చేసి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం.
బదిలీల ఆవశ్యకతను విద్యా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారికి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, మంత్రి హరీష్ రావ్ గారికి తెలియచేసాం వారి చొరవ వలన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది, వారందరికి కృతజ్ఞతలు తెలిపాం.

★ బదిలీలు ఆలస్యం ఏందుకు అవుతున్నాయి ? దీని కారకులు ఎవరు ?


బదిలీలు జరగక పొివడానికి ఏ సంఘ నాయకులు కారణం కాదు, ప్రభుత్వం తలచుకుంటే ఎవరు కాదన్నా కూడా ఒక్కరోజులో జరిగి పోతాయి, ఇది ఆర్థం కాని కొందరు నాయకులు మా సంఘాన్ని బద్నాం చేయడానికి డుబ్లికేట్ నంబర్లతో తప్పుడు మెసెజ్ లు పెడుతున్నారు, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలకు, కొందరు అధికారులకు తెలిసినట్లు బయట చెప్పుకుంటున్నారు, ఇలా చేసి అధికారుల ముందు విలువలు లేకుండా చేసారు కొందరు. 5 సం॥రాల వారందరికి కావాలని పట్టు బట్టిన వారు నేడు కమీషనర్ కు ఇచ్చిన రిక్వెస్ట్ లో ఆ విషయమే రాయలేదుందుకు.? మేం ముందు నుండి చెపుతున్నది వారికి ఇప్పుడు అర్థం అయితుంది. ప్రభుత్వం ఎలా చేసినా సరే…మొదట బదిలీలు కావాలనే అడిగాం. కొందరు ఇప్పుడు మా దారిలోనే పోరాట మార్గం లో ఒక్కరోజు కార్యక్రమం చేసారు, కాని ఏమి సాధించలేక పోయారు. మేం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, బదిలీలు అవసరం ఉన్న వారికైనా న్యాయం జరగాలి.

★ కాంట్రాక్టు అధ్యాపకుల ఇతర హక్కుల పై మీ ప్రణాళికలు ఏమిటి.?


ఉద్యోగంలో ఉండి చనిపోయిన కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం మరియు కమీషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, తెలంగాణ వచ్చాక క్రమబద్దీకరణ జరుగుతది అనుకున్నాం. అది జరిగి ఉంటే వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత తో పాటు ఆర్థిక సహాయం జరిగేది కాని నేడు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేక పోతున్నారు ఇది అన్యాయం.
ఈ విషయమై ఆరోగ్య కార్డులు, బీమా తదితర వాటి విషయంలో త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం.
కాని మా సంఘ కృషి ఫలితంగా అర్హులైన కొందరికి మృతుని కుటుంబంలోని సభ్యులు లేదా భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా ఇప్పించగలిగాం.
సమాన పనికి సమాన వేతనం విషయంలో గతంలో సమ్మెలు, దీక్షలు చేసి సాదించాం. 9 వ 10 వ PRC లు అలాగే సాదించాం. వచ్చే 11 వ PRC కూడా రావల్సిందే. దానితో పాటు కార్యచరణ చేసి క్రమబద్దీకరణ జరిగే వరకు DA మరియు HRA వచ్చేలా కృషి చేస్తాం.

★ క్రమబద్ధీకరణ జీవో అమలు సాధ్యమేనా.?


మా అంతిమ లక్ష్యం రెగులరైజేషనే. అందుకు మాకున్న శక్తి మేరకు ఉద్యమ కార్యాచరణలతో ముందుకు వెళుతాం, ప్రస్తుతం కోర్టులో కేసు ఉన్నందున ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ త్వరగా కేసు వాదించేలా ఒత్తిడి తీసుకువస్తున్నాం. న్యాయస్థాలపై మాకు నమ్మకం ఉంది, హైకోర్టులోనే కేసు మాకు అనుకూలంగా వచ్చేలా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మాకు న్యాయం జరుగలేదనిపిస్తే తప్పకుండా సుప్రీం కోర్టుకు వెళతాం. హైకోర్టులో వాదనలు జరుగక ముందే సుప్రీంకు వెళ్ళడమంటే న్యాయశాస్త్ర పరిపక్వత లేక పోవడమే. కేసు వేసిన నిరుద్యోగుల నాయకులతో గతంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఒక దారిలోకి తెచ్చాం. అలాగే యూనివర్సిటి ప్రముఖ ప్రొఫేసర్లయిన గౌరవ హరగోపాల్ గారితో, నాగేశ్వర్ గారితో, చుక్కా రామయ్య గారితో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి రెగులరైజేషన్ కు అనుకూలంగా ప్రకటనలు చేయించి ప్రభుత్వానికి అండగా నిలిచాం.

★ సంఘ కార్యకలాపాలు గురించి.?


మా సంఘ నెట్ వర్క్ చాలా పెద్దది, విద్యార్థులు, విద్యార్థి నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖ ప్రొఫేసర్లు, MLC లు ఇలా అనేక మందితో నెట్ వర్క్ కలిగి ఉన్నాం, వారందరి సలహాలు సూచనలు వారి అండదండలతో భవిష్యత్ లో అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం. మా సంఘ రథసారథి డా॥కొప్పిశెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో భవిష్యత్ ప్రణాళిక రూపొందించి మా లక్ష్యాన్ని తప్పక నెరవేర్చుకుంటాం. అప్పటి వరకు కాంట్రాక్ట్ అధ్యాపకులందరు ఇతర వాట్సాప్ నాయకుల మాయమాటలకు లొంగకుండా విఛ్చిన్నం కాకుండా సంఘటితమై ఓర్పుతో ఉండాలని కోరుతున్నాం, ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సమస్యలను సాదించేది 475 సంఘం ఒక్కటే అని గుర్తుంచుకోవాలి.

Follow Us @