హైదరాబాద్ (ఫిబ్రవరి -04) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2023) పరీక్షలు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు ఉంటాయి.
ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల నిమిత్తం గేట్ 2023 పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తంగా 8.5 లక్షల మంది విద్యార్థులు గేట్ పరీక్షకు హాజరుకానున్నారు. గేట్ లో మంచి ర్యాంకు సాధిస్తే ఎంఎస్, ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు. అదేవిధంగా, మూడేండ్లపాటు 32 కేంద్రప్రభుత్వ సర్వీసు ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు ఈ స్కోర్ను పరిగణనలోకి తీసుకొంటారు.
◆ పరీక్షల షెడ్యూల్ :
- ఫిబ్రవరి – 4న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ సైన్స్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు ఆర్కిటెక్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల వారికి పరీక్షలుంటాయి.
- ఫిబ్రవరి – 5న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎన్విరానమెంటల్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, తిరిగి మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు బయోమెడికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సుల వారికి పరీక్షలు నిర్వహిస్తారు.