క్రమబద్ధీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా – పల్లా

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి ఈరోజు ఆర్జెడి అపాయింటెడ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గాదె వెంకన్న, కుమార్ నేతృత్వంలో కలిసి వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా 317 జీవో వలన డిస్ట్రబ్ అయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఎలాంటి వేతనం కోల్పోకుండా వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పించాలని, జీవో నెంబర్ 16 మీద ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో వీలైనంత త్వరగా క్రమబద్ధీకరణ చేసి కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే కుటుంబాలకు దూరంగా నివసిస్తున్న అధ్యాపకులకు సీఎం కేసీఆర్ హామీ మేరకు బదిలీలు జరిపించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరలోనే కాంట్రాక్టు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, క్రమబద్ధీకరణ పై శుభవార్త త్వరలోనే వింటారని పల్లా హమీ ఇచ్చినట్లు గాదె వెంకన్న తెలిపారు. అలాగే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ కమిషనర్ ఒమర్ జలీల్ లతో ఫోన్లో మాట్లాడి వారికి కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగిందని గాదే వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్జెడి అపాయింటెడ్ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న ప్రధాన కార్యదర్శి కుమార్, శ్రీపతి సురేష్ బాబు, పరశురాం, ఆంజనేయులు తిరుపతి, వేణుమాధవ్ హరిబాబు, జిల్లా నాయకులు చంద్రమౌళిల తదితరులు పాల్గొనడం జరిగింది.

Follow Us @