కాంట్రాక్ట్ బదిలీలపై పల్లా ను కలిసిన గాదె వెంకన్న

రాష్ట్రంలో జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల పై సీఎం ఆదేశాలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని సీఎం ఆదేశాలను వెంటనే అమలు చేస్తూ బదిలీలు మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు జమ్మికుంటలో శాసనమండలి సభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని 508 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న బృందం కలవడం జరిగింది.

బదిలీలపై త్వరలోనే చీఫ్ సెక్రెటరీతో మాట్లాడి , మార్గదర్శకాలు విడుదలకు కృషిచేస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి హమీ ఇచ్చినట్లు గాదె వెంకన్న తెలిపారు.

కాంట్రాక్ట్ జె.ఎల్స్ బదిలీలపై ఇటీవల ఉన్నత విద్యా శాఖ నుండి కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలపై ఇంటర్ కమిషనర్ కి పంపిన లేఖ గురించి అడగడం జరిగిందని…,ఈ సందర్భంగా బదిలీల సమస్యపై స్పందిస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల ప్రస్తుత పరిస్థితి పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌, ఇంటర్ కమిషనర్ ఒమర్ జలీల్ లకు ఫోన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి వాకబు చేయడం జరిగిందని గాదె వెంకన్న తెలిపారు.

కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలపై విద్యా శాఖ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఇంటర్మీడియట్ కమీషనర్ ల సహకారంతో వారితో మాట్లాడి వారిని ఒప్పించి బాధ్యత నేనే తీసుకుంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి హమీ ఇచ్చినట్లు గాదె వెంకన్న తెలిపారు.