ఒకానొక సందర్భంలో ఒక వర్గాన్ని అన్యాయానికి గురిచేసినపుడు ఆ వర్గాల వెంట నిలబడాలనే నిశ్చయమే ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అసోషియేషన్ ఏర్పాటుకు బీజం వేసింది. అలా పదిమందితో ఆవిర్భావం జరిగిన ఆర్జేడీ సంఘం ఇప్పుడు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ వ్యవస్థలో సింహాభాగంలో ప్రాథమిక సభ్యులకు నమ్మకంగా ఏర్పడిందని చెబుతున్న సంఘం వ్యవస్థాపకుడు శ్రీ గాదె వెంకన్న గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ…
★ RJD సంఘం అనేపేరు పెట్టుటకు కారణం ఏమిటి, సంఘం ఉద్బవానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి.?
కాంట్రాక్ట్ ఆధ్యాపకులలో ఒకానొక సందర్భంలో ఒకవర్గం వారిని కాపాడే కోణంలో, జూనియర్ అధ్యాపకుల గొంతునొక్కే ప్రయత్నం చేయడం, నియమనిబంధనలకు విరుద్ధంగా ఆడిగేవాడు లేడని ఒక ఆటవిక సంప్రదాయం ద్వారా తీసుకువచ్చిన “లాస్ట్ కం ఫస్ట్ గో” అనే సర్కులర్ ద్వారా జరిగిన అన్యాయం మరోమారు పునరావృతం కావద్దనే ఉద్దేశ్యంతో మనకంటూ ఒక ప్రత్యేక వాయిస్ వినిపించే వర్గం ఉండాలని సంఘం పెట్టడం జరిగింది. 2007 నుండి అపాయింట్ ఆయున కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకాలు, ఆర్జేడీ ( రీజనల్ జాయింట్ డైరెక్టర్ ) ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులననుసరిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ద్వారా మెరిట్ ప్రాతిపదికన జరిగాయి . అలా నియామకం అయిన అధ్యాపకుల సమూహము ఆర్జేడీ సంఘం.
★ మీ సంఘం ప్రధాన లక్ష్యం.?
గత 20 ఏళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి క్రమబద్ధీకరణ హామీ ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి అయ్యాక జీవో నంబర్ 16 విడుదల చేయడం జరిగింది, కానీ ఆ ప్రక్రియ కోర్ట్ లలో ఉందని, క్రమబద్దీకరణ అంశం చివరి మెట్టు పై ఉందని దానిని తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సాదించడమే ప్రధాన లక్ష్యం. ఇప్పటికే కాంట్రాక్టు ఆధ్యాపకుల క్రమబద్ధీకరణ మరియు ఇతర సమస్యలపై రెండు మూడు పర్యాయాలు సీఎం కేసీఆర్ గారిని కలిశాం, క్రమబద్ధీకరణ కొరకై తెలంగాణ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇంతవరకు ఏ సంఘం కూడా సహసం చేయని విధంగా భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటంలో మిగతా సంఘాల కంటే ముందున్నాం.
ఆలోపు ప్రాథమిక సభ్యులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అయినా నెలవారీ వేతనం, డీఏ అమలు, సాదరణ సెలవులు పెంపు, ప్రసూతి సెలవులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, డ్యూటీ లో మరణిస్తే ప్రభుత్వం తరపున కుటుంబానికి ప్రయోజనాలు మొదలగు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బదిలీల అనంతరం కార్యచరణ ప్రకటిస్తాం.
సుప్రీంకోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ
★ న్యాయ పరిధిలో ఉన్న క్రమబద్ధీకరణ అంశం గురించి.?


ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించన నేపథ్యంలో నిరుద్యోగులు కొందరు దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు సంప్రదించగా స్టే విధించిన విషయం తెలిసిందే, దీనిపై వెనకడుగు వేయకుండా సంఘం తరపున దాదాపు రెండు వేల మంది సభ్యుల ఇంప్లీడ్ తో సుప్రీంకోర్టు కూడా వెళ్లడం జరిగింది. మన కేసును స్వీకరించిన సుప్రీం కోర్ట్ 10 వారాల గడువు లోపల ఈ సమస్యను పరిష్కరించాలని హైకోర్టుకు గడువు విధించిన, ప్రభుత్వం నుండి కౌంటర్ దాఖలు కాకపోవడంతో ఆ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తరపున కౌంటర్ వేయించి కేస్ ను వెకెట్ చేపించి జీవో నంబర్ 16 అమలుకు కృషి చేస్తాం.
★ ప్రమాదాల్లో మరణించిన కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాల పరిస్థితి ఏమిటి ?
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ అకస్మాత్తుగా మరణిస్తే వారికి ఎటువంటి ప్రయోజనాలు ప్రభుత్వం తరపు నుండి గాని ఇంటర్మీడియట్ బోర్డు తరఫు నుండి గాని ఇప్పటివరకు లేకపోవడం బాధాకరం. వీటన్నింటికి క్రమబద్దీకరణ ఒక్కటే మార్గం. ఇప్పటివరకు చాలా మంది వివిధ ప్రమాదాల్లో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని చాలాసార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా సాంకేతిక కారణాల వల్ల ప్రయోజనం కలగలేదు. చనిపోయిన కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబానికి 5 లక్షల వరకు ఆర్జేడీ సంఘం తరపున నేరుగా ఇచ్చేవిదంగా కార్యాచరణ చేయబోతున్నాం. కాంట్రాక్టు అధ్యాపకులు చనిపోయిన సందర్భంగా ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. కానీ అది కేవలం సావు , దినాల ఖర్చుకు కూడా సరిపోవడం లేదు. ఎవరో ఎదో చేస్తారనే కంటే మనం, మనకోసం సంఘటితం కావలనేది మా ఉద్దేశం.
★ క్రమబద్ధీకరణ లోపల ఇతర సమస్యల సాదన పై మీ కార్యచరణ.?
ముఖ్యమంత్రి బదిలీల మీద ప్రకటన చేసిన నేపథ్యంలో సెలవులు, నెలనెలా జీతాలు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ అవి నేటికీ అందటం లేదు కాబట్టి ఇవి అందుతున్నాయని సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది, కాబట్టి ప్రధాన సమస్యలు అయినా నెలవారీ వేతనం, డీఏ అమలు, సాదరణ సెలవులు పెంపు, ప్రసూతి సెలవులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, డ్యూటీ లో మరణిస్తే ప్రభుత్వం తరపున కుటుంబానికి ప్రయోజనాలు అతి త్వరలోనే సాధించేందుకు సంఘం తరఫున కృషి చేస్తాం.
★ నూతన విద్యా విధానం పై మీ అభిప్రాయం.?
సమకాలీన భారతదేశ పరిస్థితులలో నూతన విద్యా విధానం అమలు ప్రస్తుతం సాధ్యసాద్యాలపై చర్చ జరుగుతోంది. దాని అమలుకు ఇంకా సమయం పట్టవచ్చు. అలాగే నూతన విద్యా విధానంలో ఒప్పంద ఉద్యోగుల వ్యవస్థ రద్దు చేయాలనే ప్రతిపాదన చేశారు. కానీ దేశ వ్యాప్తంగా ప్రతి శాఖలో మెజారిటీ సంఖ్యలో 15 నుండి 20 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఏ విధంగా న్యాయం చేయాలనే విషయాన్ని నూతన విద్యా విధానంలో పేర్కొనలేదు. కావున ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలిసి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఒప్పంద ఉద్యోగులకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వనున్నాం. కానీ ఈ లోపలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో త్వరలోనే క్రమబద్ధీకరణ సాదిస్తం అనే నమ్మకం ఉంది.
★ కాంట్రాక్టు అధ్యాపకులకు రాబోయే పీఆర్సీ అమలు సాద్యమా.?
పీఆర్సీ కమిటీ సభ్యులకు వినతి పత్రం ఇస్తూ…
తెలంగాణ నూతన రాష్ట్రంగా ఎర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మేము బేసిక్ పే ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా అందుకుంటున్నాం. మేము పీఆర్సీ కమిటీ ని కూడా కలిసి మా కాంట్రాక్టు అధ్యాపకులకు నూతన పీఆర్సీ అమలు అయ్యో విధంగా సిపార్సులు చేయాలని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కచ్చితంగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటే ఈసారి నూతన పీఆర్సీని కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేస్తారని నమ్మకం పీఆర్సీ కమిటీ మీద మరియు ప్రభుత్వం పై ఉంది.
★ బదిలీలపై సియం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం పై స్పందన ఏమిటి.?
13 సంవత్సరాల నుండి ఎన్నో బాధలు అనుభవిస్తున్న వారి కుటుంబాల్లో సియం గారి నుండి సానుకుల స్పందన చూడగానే వందలమంది ఆ సంతోషాన్ని నాతో పంచుకోవడం మరుపురాని సందర్భం , ఈ క్రెడిట్ అంతా సబితమ్మ , రాజేశ్వర రెడ్డిగారిదే. బదిలీలపై
తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషి మరియు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సహకారంతో బదిలీల అంశం సీఎం దృష్టికి వెళ్లి సానుకూలంగా పరిష్కరించడం హర్షణీయం. ఇదేవిధంగా శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సమస్యలను మరియు క్రమబద్ధీకరణ అంశాన్ని కూడా సాధించగలమని పూర్తి నమ్మకంతో ఉన్నాము.
★ కొంత మంది బదిలీలను వ్యతిరేకిస్తున్నారు కదా మీ అభిప్రాయం.?
ఒక ఉద్యోగి కి బదిలీలు అనేవి సర్వ సాదరణ అంశం. కాంట్రాక్టు ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ లేనప్పటికీ మానవతా దృక్పథంతో మరియు పాలన సౌలభ్యం కోసం అనేక డిపార్ట్మెంట్ లలో కాంట్రాక్టు ఉద్యోగులను ప్రతి సంవత్సరం స్థాన చలనం ప్రభుత్వం గావిస్తుంధి. అలాగే 2013 లో కూడా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులను 5 సంవత్సరాల గడువు తో బదిలీలు చేసిన విషయం తెలిసిందే. ఇక ముందు కూడా ప్రతి 5 సంవత్సరాలకొకసారి బదిలీలు జరిపితే ఎవరికి అన్యాయం జరగదు.
బదిలీల మీద సీఎం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని సంఘాలు దాని మీద లేనిపోని అపోహలు సృష్టిస్తూ, అంతర్గత చర్చలలో బదిలీలు జరగరాదని, బయటకి మాత్రం బదిలీలు జరగాలని రెండు కళ్ళ సిద్దాంతం ప్రదర్శిస్తున్నాయి. ఇలా బహిరంగంగా బదిలీలకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో స్పష్టమైన వైఖరిని చెప్పలేని సంఘాల మనుగడను భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
★ మీ బదిలీల వలన 1500 మంది అతిధి అధ్యాపకుల భవిష్యత్ ఏమి కానుంది.?
ఇది కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఉంటుంది. బదిలీలకు అతిధి అధ్యాపకుల ఉద్యోగాలకు సంబంధమే లేదు. 15 నుండి 20 సంవత్సరాలుగా ఎక్కడైనా కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాము. రెగ్యులర్ అధ్యాపకుల బదిలీల వల్ల మేము ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధపడ్డాం. ఇపుడు మా బదిలీల తర్వాత ఏర్పడే ఖాళీలతో అతిధి అధ్యాపకులకు ఇవ్వొచ్చు. అతిధి అధ్యాపకులకు ఉద్యోగం కావాలి కానీ అదే కాలేజీలో ఉద్యోగం కాదు. ఈ విషయాన్ని మేము అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు కూడా విన్నవించాము.
Follow Us @