కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి వర్తింపచేయడం చారిత్రాత్మక నిర్ణయం – గాదె వెంకన్న.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యొక్క నిర్ణయం పట్ల యావత్ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం గారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నామని ఆర్జేడీ యూనియన్ అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ లు తెలిపారు.

గత ప్రభుత్వాలు గత నాయకులు ఎప్పుడూ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకున్న పరిస్థితి లేదని, అందుకు భిన్నంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కేసీఆర్ కి కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ కుటుంబాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

Follow Us@