కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యూవల్ ఉత్తర్వులపట్ల హర్షం వ్యక్తం చేసిన గాదె వెంకన్న, కుమార్

రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3686 కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల, 272 ఎంటీఎస్ అధ్యాపకులు & 78 వివిధ కేటగిరీలుగా పనిచేస్తున్న ఆవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు పొడిగిస్తూ 2021- 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల ఆర్జెడి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న , ప్రధాన కార్యదర్శి కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలపై సియం ఆదేశాలు అమలుచేయాలి

ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీలపై సియం ఆదేశాలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని… ఇకనైనా ఆదేశాలు అమలుకు అధికారులు చొరవ చూపాలని ఆర్జేడి సంఘం నాయకులు గాదె వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.