తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది హజరు కావాలని ఇంటర్మీడియట్ కమీషనర్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీచేశారు.
కరోనా నేపథ్యంలో తెలంగాణ లో ఆలస్యంగా ప్రారంభమైన జూనియర్ కళాశాలలలో 50% మంది సిబ్బంది మాత్రమే హజరు అవ్వాలని గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే తాజాగా జూనియర్ కళాశాలలో పని చేస్తున్న సిబ్బంది అందరూ ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కళాశాలలకు పూర్తి స్థాయిలో హాజరుకావాలని ఇంటర్ విద్యా కమిషనర్ ఒమర్ జలీల్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
డీడీ యాదగిరి, టీ శాట్ చానల్స్ ద్వారా డిజిటల్ తరగతులు నడుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని అలాగే అకడమిక్ పనులు పూర్తి స్థాయిలో జరగడానికి పూర్తి స్థాయిలో సిబ్బంది కళాశాలలకు హజరు కావాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.