FRENCH OPEN : ఫైనల్లో జకోవిచ్ vs కాస్పర్ రూడ్

పారిస్ (జూన్ – 10) : ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ సెమి ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు ఆల్కరాజ్ ను ఓడించి ఫైనల్ కు చేరాడు. మరొక సెమీ ఫైనల్ మ్యాచ్ లో కాస్పర్ రూడ్ జ్వరేవ్ ను ఓడించి ఫైనల్ కు చేరాడు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ కాస్పర్ రూడ్ తలఫడనున్నారం.

ఈ ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ గెలిస్తే 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించనున్నాడు

మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ పోరు శనివారం జరగనుంది ఈ ఫైనల్ లో ఇగా స్వైటెక్ మరియు ముచోవా తలపడనున్నారు. ఇప్పటికే స్వైటెక్ 2020, 2022లలో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. గతేడాది యూఎస్ ఓపెన్ కూడా ఆమె గెలుచుకుంది.
ముచోవా ఈ టైటిల్ నెగ్గితే ఆమెకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కానుంది.

ఫ్రెంచ్ ఓపెన్ 2023 మిక్స్డ్ డబుల్స్ టోర్నీని మియు కాటో & పుయోజ్ జోడి గెలుచుకుంది ఫైనల్ లో వీరు బియాంక & మైకెల్ జోడిని ఓడించారు.

ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల డబుల్స్ విభాగం ఫైనల్స్ లో యక్స్. వాంగ్ – యస్. హసీ జోడి టౌన్‌సెండ్ – ఫెర్నాండెజ్ జోడితో తలపడనున్నారు.

ఫ్రెంచ్ ఓపెన్ 2023 పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్స్ లో డోడిగ్ – క్రాజేక్ జోడి వ్లెయిన్ – గిల్లే జోడితో తలపడనున్నారు.